Monday, April 20, 2026
Homeఫోటోలుఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ (జూన్ 24 మంగళవారం) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. భవిష్యత్ అవసరాల కోసం ఒకే విధమైన నిబంధనలతో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

పలు సంస్థలకు భూకేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయికి క్రీడల కోటాలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. తిరుపతి జిల్లా మడమాలపేటలో 12 ఎకరాలకు పైగా స్థలాన్ని పర్యాటక శాఖకు బదిలీ చేసేందుకు అంగీకారం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News