Friday, April 24, 2026
Homeరంగారెడ్డిKawadipally | కవాడిపల్లి లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికా

Kawadipally | కవాడిపల్లి లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికా

అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, కవాడిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారము మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రత్యేక మహిళా గ్రామసభ ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్బంగా గ్రామంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక , 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా పరిసరాల పరిశుభ్రత, తడిచెత్త పొడిచెత్త, మహిళా సాధికారత, భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించటం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని కవాడిపల్లి సర్పంచ్ కొలన్ ప్రసన్న రవీంద్రారెడ్డి ఆద్వార్యములో నిర్వహించగా ముఖ్య అతిథిలుగా అబ్దుల్లాపుర్మెట్ ఎంపీడీఓ శ్రీవాణి, DLPO సాధన రెడ్డి, ఉప సర్పంచ్ రాసాల రాము యాదవ్, గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, డ్వాక్రా మహిళలు, మాజీ సర్పంచులు కందాడి కృష్ణా రెడ్డి, సుర్వి బాలమణి, తధితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News