Tuesday, October 28, 2025
ePaper
Homeమెదక్‌Relief | నిరుపేద కుటుంబాలకు అండగా కరుణాకర్..!

Relief | నిరుపేద కుటుంబాలకు అండగా కరుణాకర్..!

  • మరణించిన కూలీల కుటుంబాలకు ఆర్థిక సహాయం

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం తిప్పారం గ్రామంలో మానవతా విలువలకు నిలువుగా నిలిచిన ఘటన చోటుచేసుకుంది. బారాస పార్టీ సీనియర్ నాయకుడు ఇరుసల కరుణాకర్ అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు నిరుపేద కూలీల కుటుంబాలకు వ్యక్తిగతంగా ముందుకువచ్చి ఆర్థిక సాయం అందించారు. తిప్పారం గ్రామానికి చెందిన మధుర భాయ్, అలాగే తిమ్మాపురం మల్లేశం అనే ఇద్దరు కూలీలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న ఇరుసల కరుణాకర్ బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలసి కుటుంబానికి ₹5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కరుణాకర్ మాట్లాడుతూ నిరుపేదలు, కూలీలకు తోడుగా నిలవడం మన బాధ్యత. ఇలాంటి సందర్భాల్లో మనం చూపే సహాయం చిన్నదైనా, వారి మనసుకు పెద్ద ధైర్యం ఇస్తుంది, అని తెలిపారు.


ఈ కార్యక్రమంలో బొబ్బాయిపల్లి మాజీ సర్పంచ్ కోల శ్రీనివాస్, బారాస గ్రామ అధ్యక్షులు కోరే చరణ్, అప్ప కోరే నాగప్ప, వార్డ్ మెంబర్ దెబ్బేట స్వామి, ముద్దపురం మహేందర్, కొండపాక మహేష్, తుడుం ఎల్లం, ముద్దపురం బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News