Homeరంగారెడ్డిEncroachment | ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి

Encroachment | ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి

చట్టానికి సవాల్ విసురుతూ పెట్రేగిపోతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్న ఘటన జవహర్ నగర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Government Land Fence Destroyed In Jawahar Nagar Keesara Circle2

జిహెచ్ఎంసి కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న 695, 696 సర్వే నెంబర్లకు చెందిన సుమారు 29 గుంటల ఖాళీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. ఫిబ్రవరి 5వ తేదీన కాప్రా మండల తహసిల్దార్ బైరెడ్డి రాజేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అక్కడ కంచె ఏర్పాటు చేశారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని స్పష్టంగా తెలియజేస్తూ ఎవరైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

- Advertisement -
Government Land Fence Destroyed In Jawahar Nagar Keesara Circle0

అయితే అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు అక్రమార్కులు చట్టానికి సవాల్ విసురుతూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Government Land Fence Destroyed In Jawahar Nagar Keesara Circle3

ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ధ్వంసమైన కంచెను మళ్లీ ఏర్పాటు చేసి భూమిని పరిరక్షించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Government Land Fence Destroyed In Jawahar Nagar Keesara Circle4
- Advertisement -
RELATED ARTICLES

Latest News