Saturday, March 21, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐNRI | ఊరుకి ప్రెసిడెంట్ అవ్వాలని.. US నుంచి..

NRI | ఊరుకి ప్రెసిడెంట్ అవ్వాలని.. US నుంచి..

కొందరు.. సంపాదన(Earning)తో సంతృప్తి చెందరు. ప్రజాసేవ (Public Service) కోసం పరితపిస్తుంటారు. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఉన్న ఊరు(Native Place)ను మర్చిపోరు. తమ వారికి ఏదో చేయాలని తపిస్తుంటారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు కంజర్ల చంద్రశేఖర్ (Kanjarla Chandrasekhar) ఈ కోవలోకే వస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections) పోటీచేసి సర్పంచ్‌(Sarpanch)గా గెలిచి సొంతూరుకి తన వంతు సాయం చేయాలని సంకల్పించారు.

అందుకే.. అమెరికా(America)ను సైతం కాదనుకొని వచ్చాడు. లక్షల్లో శాలరీ వచ్చే సాఫ్ట్‌వేర్ కొలువు(Software Job)కు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ నెల 30న నామినేషన్ (Nomination) వేయబోతున్నాడు. చంద్రశేఖర్ తాత శంకరప్ప ఏకంగా 40 ఏళ్లపాటు సర్పంచ్‌గా చేశాడు. దీంతో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని బరిలోకి దిగుతున్నాడు. ఆరు నెలల కిందటే స్వదేశానికి చేరుకొని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నాడు. చంద్రశేఖర్ సంకల్పానికి గ్రామస్తులు ఓటుతో సపోర్ట్‌గా నిలుస్తారని పలువురు ఆశిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News