Thursday, April 23, 2026
Homeఆదిలాబాద్Inspection | జాతికుంట చెరువు అభివృద్ధి పనులు పరిశీలన

Inspection | జాతికుంట చెరువు అభివృద్ధి పనులు పరిశీలన

బెల్లంపల్లి శాసనసభ్యులు, గడ్డం. వినోద్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల పురాతన జాతికుంట చెరువు సుందరీకరణ పనులలో భాగంగా చేపట్టిన చెరువు విస్తీర్ణం పెరిగే సర్వేను పర్యవేక్షించిన *బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి. శ్రీ. దావ స్వాతి-రమేష్ బాబు

ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ… జాతికుంట చెరువును గతంలో పలువురు ఆక్రమణదారులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు వార్డ్ ప్రజలు తమ ద్రుష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే *గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు, నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల ద్వారా చెరువు భూమిని పూర్తిస్థాయిలో సర్వే చేయించి, హద్దులను ఖరారు చేయిస్తామని, చెరువు హద్దుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఉంటే తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News