Homeరంగారెడ్డిInauguration | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం..

Inauguration | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం..

  • పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

పేదల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆరు గ్యారంటీ పథకాల అమలుతో తెలంగాణ స్వర్ణయుగంలా మారుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్ గబ్బిలాలపేటలో నూతనంగా నిర్మించిన నాలుగు ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కార్యదర్శి కల్లేపల్లి సదానంద్, ఏఈ శ్రీహరితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీకాంత్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు.

- Advertisement -
Indiramma Houses Inauguration Medchal Malkajgiri

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సారథ్యంలో జవహర్ నగర్ ప్రాంతానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమకు సొంత ఇంటి కలను నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తకొండ వేణు, నాయకులు అజయ్ కుమార్, సోమేశ్ చారి, మబ్బు అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News