Homeమహబూబ్‌నగర్‌Constitution | భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రతీక.

Constitution | భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రతీక.

  • డిసిసి అధ్యక్షుడు కొత్త కాపు శివసేనారెడ్డి..
  • నూతన జిల్లా కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రతీక అని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త కాపు శివసేన రెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి జిల్లా అధ్యక్షుడు కొత్త కాపు శివసేన రెడ్డి హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ..

Indian Constitution Is Symbol of Democracy Shiva Sena Reddy2

ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడుతూ .. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ప్రతిఫలమే ప్రపంచంలో గర్వించదగ్గ స్థాయికి భారతదేశం చేరిందని .. దేశ గౌరవం, స్వేచ్ఛకు, సమానత్వానికి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ డిసిసి అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మహిళా రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Indian Constitution Is Symbol of Democracy Shiva Sena Reddy
- Advertisement -
RELATED ARTICLES

Latest News