గుజరాత్‌లోని వడోదర(vadodara)లో ఆదివారం న్యూజిలాండ్(New zealand)తో జరిగి మొదటి వన్డేలో ఇండియా విజయం(India win) సాధించింది. 301 పరుగుల లక్ష్యాన్ని మన దేశం ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఆరు వికెట్లు కోల్పోయి 306 రన్నులు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యత సాధించింది. ఇండియా టీమ్‌లో కోహ్లీ(Kohli) 93, శుభ్‌మన్‌గిల్(Shubman gill) 56, శ్రేయస్ అయ్యర్ 49 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. మన బౌలర్లలో సిరాజ్(Siraj), రానా, ప్రసిధ్ రెండు వికెట్ల చొప్పున తీశారు. కుల్‌దీప్ ఒక వికెట్ నేలకూల్చాడు. కివీస్ జట్టుతో మిచెల్ 84 రన్నులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జెమిసన్ ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టాడు. క్లార్క్, అశోక్ చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
- Advertisement -
