Homeక్రైమ్ వార్తలుJagtial Child Death| జగిత్యాల జిల్లాలో విషాదం..

Jagtial Child Death| జగిత్యాల జిల్లాలో విషాదం..

  • పశువుల నీళ్ల తొట్టిలో పడి బాలుడి మృతి..Jagtial Child Death
  • మల్లాపూర్ మండలం, వడ్డెర కాలనీలో ఘటన..

జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది (Jagtial Child Death).ఆడుకుంటూ తిరగాల్సిన ఆరేళ్ల చిన్నారి విగతజీవిగా మారడంతో ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. వడ్డెర కాలనీకి చెందిన సూర లావణ్య, అంజయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

లావణ్య రోజువారీ కూలీ పనుల కోసం ఉదయం వాల్గొండ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు మాత్రమే కనిపించారు. ఆరేళ్ల కుమారుడు సూర బన్నీ కనిపించకపోవడంతో తల్లి ఆందోళనకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో బాలుడు పడి మృతి చెందినట్లు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News