Tuesday, January 20, 2026
EPAPER
HomeతెలంగాణIbomma Ravi | ఐ బొమ్మ రవికి పలు దేశాల్లో పౌరసత్వం

Ibomma Ravi | ఐ బొమ్మ రవికి పలు దేశాల్లో పౌరసత్వం

  • ఐదు కేసుల్లో బెయిల్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు
  • బెయిల్‌ ఇస్తే దేశం దాటి వెళ్లిపోయే అవకాశం ఉందని వ్యాఖ్య

పైరసీ వెబ్‌సైట్‌ ’ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతడి బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్‌ ఇస్తే దేశం దాటి వెళ్లిపోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని ఐ బొమ్మ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటీవల నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ బెయిల్‌ పిటిషన్లపై బుధవారం నాడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా తాను హైదరాబాద్‌ వదిలి వెళ్లనని.. పోలీసు విచారణకు సహకరిస్తానని రవి కోర్టుకు తెలిపారు. ఇకపై పైరసీ చేయనని మొర పెట్టుకున్నాడు. మరోవైపు కేసు దర్యాప్తు దశలో ఉన్నదని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే ఇమ్మడి రవికి పలు దేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్‌ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఐబొమ్మ రవి అభ్యర్థనను తోసిపు చ్చింది. ఐదు కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఆ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News