Wednesday, April 22, 2026
Homeహైదరాబాద్‌గిన్నీస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకోవడమే లక్ష్యం.

గిన్నీస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకోవడమే లక్ష్యం.

గిన్నీస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ఇంటర్నెషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26న గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచంలోనే అతి పెద్ద కరాటే ప్రదర్శన నిర్వహించనున్నట్లు అకాడమీ అధ్యక్షులు, 30 గిన్నీస్ బుక్ రికార్డు గ్రహిత, గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి, మాస్టర్ విఠల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లో మంగళవారం రోజు జరిగిన విలేఖరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ…

ఈ భారీ ప్రదర్శనలో తెలంగాణతో పాటు దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన సుమారు 1500 మంది కంటే ఎక్కువ కరాటే క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆరేండ్ల బాలుడి నుంచి అరవై సంవత్సరాల వృద్ధుడి వరకు ఈ ప్రదర్శనలో భాగస్వాములు కావచ్చని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా నిలుస్తుందన్నారు. ఈ అరుదైన ఫీట్ను రికార్డు చేసేందుకు గిన్నీస్ బుక్ రికార్డ్స్ అధికారిక ప్రతినిధులు హాజవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అకాడమీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు మాస్టర్ శ్రీధర్, మాస్టర్ రాము, మాస్టర్ శ్రీకాంత్ సుమాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News