Homeఆదిలాబాద్Skill | ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి

Skill | ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి

  • “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” సంక్షేమ వారోత్సవాలను విజయవంతంగా కొనసాగించాలి.
  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా, సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. స్టోర్ రూమ్ తనిఖీ చేశారు. ఫుడ్ కమిటీ లో సభ్యులుగా ఉన్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ… వారికి అందిస్తున్న భోజనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాల ముడిసరుకుల గడువు వివరాలు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఆహార పదార్థాల గడువు తేదీ రిజిస్టర్లలో తప్పనిసరి నమోదు చేసి, ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలన్నారు.

- Advertisement -
Collector Inspects School Facilities And Indiramma House Under Welfare Week

తరగతి గదిలో విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారికి అందుతున్న విద్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాఠాలు చదివిపించారు. క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” లో భాగంగా వసతి గృహాల్లో సంక్షేమ వారోత్సవాలు సమర్థవంతంగా చేపట్టాలని వివరించారు. అవసరమైన చిన్న చిన్న రిపేర్లకు సంబంధించిన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

Collector Inspects School Facilities And Indiramma House Under Welfare Week3

అనంతరం గ్రామంలోని లబ్ధిదారురాలు సుల్తానా కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నందున లబ్ధిదారు కుటుంబ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఇందిరమ్మ ఇంటిని కట్టించినందుకు ప్రభుత్వానికి లబ్ధిదారురాలు కృతజ్ఞతలు తెలిపారు. తన సొంత ఇంటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో భోజన్న, డిటిడిఓ అంబాజీ, తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మికాంత రావు, ఎంపీఓ అజీజ్ ఖాన్, గ్రామ సర్పంచ్ మల్లేష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News