Thursday, February 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంGodumakunta | గోదుమకుంట కుంభకోణం

Godumakunta | గోదుమకుంట కుంభకోణం

  • విచారణను తొక్కిపెట్టిన జిల్లా రిజిస్ట్రార్‌?
  • ఐజీ ఆదేశాలకే దిక్కులేదా!
  • మేడ్చల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అవినీతి పరాకాష్ట..
  • కమిషనర్‌ లేఖలే మాయం!

కంచే చేను మేసినట్లు’’ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రిజిస్ట్రేషన్లశాఖే కబ్జాదారులకు కాపలాదారుగా మారడం మేడ్చల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గోదుమ కుంట గ్రామంలో జరిగిన 76 అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవ హారం చూస్తుంటే, అవినీతి అధికారుల తీరు ‘‘అడ్డ దారికి పోయినోడికి అడుగడుగునా గండం’’ అన్న భయం లేకుండా, ఏకంగా అండదండలే లభిస్తుండటం విచారకరం. అధికారం అండ.. అవినీతికి దండ అన్న ట్లుగా సబ్‌ రిజిస్ట్రార్లు చేసిన అక్రమాలు ఆధారాలతో సహా బయటపడినా, జిల్లా రిజిస్ట్రార్‌ మాత్రం ‘‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’’ అన్న చందంగా, విచార ణను ముందుకు సాగనివ్వకుండా తొక్కిపెడుతున్నారు. ఐజీ ఆదేశాలకే దిక్కులేకపోవడం చూస్తుంటే, ఆ కార్యా లయంలో ‘‘గురువుకు తగ్గ శిష్యులు’’ అన్నట్లుగా, చట్టం కంటే సొంత లాభాలే పరమావధిగా కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కంచే చేను మేసిన చందంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ తీరు తయారైంది. కీసర మండలం గోదుమకుంట సర్వే నెం. 101లో జరిగిన 76 అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే, జిల్లా రిజిస్ట్రార్‌ మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తుండటం వెనుక ఉన్న మర్మమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమార్కులైన సబ్‌-రిజిస్ట్రార్లకు జిల్లా అధికారి అండగా నిలుస్తున్నారా? అన్న అనుమానాలు ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఉన్నతాధికారుల ఆదేశాలకే ‘పాతర’

ఈ భారీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ రిజిస్ట్రేషన్‌ మరియు స్టాంపుల శాఖ కమిషనర్‌ కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గోదుమకుంట గ్రామంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరపాలని జిల్లా రిజిస్ట్రార్‌కు లేఖలు రాసింది. సాధారణంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. కానీ, ఇక్కడ సీన్‌ రివర్స్‌. కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలను కనీసం రికార్డుల్లో నమోదు చేయకుండా, ఫైల్‌ పుటప్‌ చేయకుండా తొక్కిపెట్టడం వెనుక భారీ స్థాయిలో ‘ముడుపులు’ చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ రిజిస్ట్రేషన్ల చిట్టా:

గోదుమకుంట గ్రామం, సర్వే నంబర్లు 101 మరియు 28. నకిలీ ూRూ పత్రాలు, నిబంధనలకు విరుద్ధంగా సృష్టించిన గ్రామ పంచాయతీ లేఅవుట్లు. ప్రభుత్వ జీవోలు (G.ూ.వీం.చీశీ. 131, 135 డ 28) తుంగలో తొక్కి చేసిన రిజిస్ట్రేషన్లు.
ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కదలని యంత్రాంగం.

అక్రమార్కులకు జిల్లా అధికారి అభయహస్తం!

ప్రకృతి వనరులను, కుంటలను రియల్టర్లకు దోచిపెట్టిన సబ్‌-రిజిస్ట్రార్లు బి. సురేష్‌, బి. సందీప్‌ కుమార్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, వారిని ఇప్పటికీ అదే విధుల్లో కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

నిర్లక్ష్యం: మున్సిపాలిటీ అనుమతులు లేవని తేలినా, మెమోలను బేఖాతరు చేసినా జిల్లా అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారు?

రికార్డుల మాయం: కమిషనర్‌ కార్యాలయం పంపిన లేఖలు అధికారిక రిజిస్టర్‌లో నమోదు కాకపోవడం కార్యాలయంలో పారదర్శకత లోపానికి నిదర్శనం.

వాటాల పంపిణీ?: ఒక్కో రిజిస్ట్రేషన్‌కు సుమారు రూ. 2 లక్షల చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేసిన సబ్‌-రిజిస్ట్రార్ల నుండి జిల్లా అధికారికి కూడా వాటా అందిందా? అందుకే విచారణను నీరుగారుస్తున్నారా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

వ్యవస్థకు పట్టిన చీడ.. ఏసీబీ విచారణకు డిమాండ్‌

భవిష్యత్‌ తరాల కోసం కాపాడాల్సిన కుంటలను కబ్జాదారులకు అప్పగించిన సబ్‌-రిజిస్ట్రార్లు ఇద్దరూ ఏమాత్రం భయం లేకుండా విధుల్లో కొనసాగడం వ్యవస్థ పతనానికి అద్దం పడుతోంది. ఆధారాలతో ఫిర్యాదు చేసినా జిల్లా అధికారి మీనమేషాలు లెక్కించడం వెనుక ‘‘అక్రమార్కుల రక్షణ కవచం’’లా ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి, ఏసీబీ చేత లోతైన విచారణ జరిపించాలని మేడ్చల్‌ ప్రజలు కోరుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌ పర్యవేక్షణ లోపంపై, సబ్‌-రిజిస్ట్రార్ల అవినీతిపై కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో ప్రభుత్వ భూములు, కుంటలు నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News