Friday, April 3, 2026
Homeఆంధ్రప్రదేశ్Andhra Pradesh | మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ

Andhra Pradesh | మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ

అమరావతి(Amaravathi)లోని వెంకటపాలెం(Venkatapalem)లో మాజీ ప్రధాని(Former PM) అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని(Atal Bihari Vajpayee Statue) ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రసంగిస్తూ.. జైభారత్, జై తెలుగు తల్లి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతి రోజూ ఓ మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర మంత్రి(Union Minister) శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రపంచమంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే ధ్యేయమని ప్రకటించారు.

CM Chandrababu, Union Minister Shivraj Singh Chouhan

చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

  • స్పూర్తిదాత వాజ్‌పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి.
  • చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నాం.
  • అటల్ మోదీ సుపరిపాలనా యాత్రను బీజేపీ ప్రారంభించింది.
  • 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి సంయుక్తంగా పనిచేసింది.
  • అమరావతిలో వాజ్‌పేయి విగ్రహంతోపాటు ఆయన చరిత్ర, సుపరిపాలనను ప్రజలకు తెలిసేలా స్మృతివనం ఏర్పాటుచేస్తున్నాం.
  • సుపరిపాలన దివస్‌గా అటల్ జీ జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాం.
  • తెలుగు నేలలో అలాంటి స్పూర్తి ఇచ్చే నేత ఎన్టీఆర్. వీరంతా చరిత్రను తిరగరాసిన నేతలు
  • నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రేసతర పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఎన్టీఆర్.
  • వాజ్‌పేయి, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది.
  • జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటుచేసిన ప్రయాణం కూడా అత్యంత కీలకం.
  • మంచి వక్త, కవి, ప్రజా హృదయ నేతగా అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారు.
  • వాజ్‌పేయి ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ -చెన్నైల మధ్యే ప్రారంభించాం
  • నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్‌ను డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారు
  • ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు
  • పీపీపీ విధానంలో దేశాభివృద్ధికి బీజం వేసి ఆచరణలో పెట్టి ఇప్పుడు అగ్ర స్థానానికి తీసుకెళ్తున్నాం
  • ఓపెన్ స్కై పాలసీ, నగరాల మధ్య రహదారులు లాంటి వివిధ సంస్కరణలు దేశ ప్రగతికి కీలక బిందువుగా నిలిచాయి.
  • దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్‌పేయి.
  • అప్పటి కార్గిల్ యుద్ధంలో వాజ్‌పేయి, ఇప్పుడు సింధూర్‌లో ప్రధాని మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని చాటారు
  • మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దార్శనిక నేత వాజ్‌పేయి ఇద్దరూ దేశం కోసం పని చేసిన నేతలు
  • దేశం మెచ్చిన నేతగా మాజీ ప్రధాని వాజ్‌పేయి చిరస్మరణీయులు. అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నాం
  • ఎన్టీఆర్ లాంటి నేతల్ని కూడా గుర్తుంచుకునేలా అమరావతిలో స్మారకాన్ని ఏర్పాటుచేస్తాం.
  • 11వ స్థానంలో ఉన్న భారత్.. ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలతో అగ్ర స్థానానికి చేరుకోబోతోంది.
  • 2047 నాటికి భారత్.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి వస్తుంది.
  • దేశాన్ని శిఖరాగ్రంలో నిలిపే శక్తి ప్రధాని మోదీకి ఉంది.
  • అమరావతిలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం.
  • రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి
  • గేరు మార్చి పనుల్ని వేగవంతం చేస్తాం.
  • నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ శంకుస్థాపన చేశారు.
  • ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం.
  • అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటం జోరు.
  • హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది.
  • గత పాలనలో రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. ఇప్పుడు కోలుకొని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టింది
  • పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారు.
  • మెరుగ్గా ప్రాజెక్టు నిర్మితం కావాలంటే పీపీపీ ద్వారానే వేగంగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా ఇదే నిరూపితం అయింది.
  • పీపీపీ పద్దతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం.
  • పీపీపీ అంటే ప్రైవేట్ కాదు. ప్రభుత్వ ఆస్తే. దానిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తారు.
  • కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. అలాంటి వ్యక్తుల నైజాన్ని ప్రజలు అర్థంచేసుకోవాలి.
  • వాజ్‌పేయి లాంటి ఉన్నత నాయకులతో రాజకీయం చేసి ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయటం సిగ్గు అనిపిస్తోంది.
  • ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ అభివృద్ది యాత్ర అగదు. సంపద ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
  • గతంలో వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోదీ స్పూర్తిని ఇస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News