- ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి..
- లక్కీ డ్రాలో అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు..
- కోర్టు నుంచి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి రాంబాబు..
ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ పొందిన అంబటికి గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి కోర్టు గురువారం రిమాండ్ తీర్పునిచ్చారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో అక్రమాలు జరిగాయంటూ ఒకరు కేసు నమోదు చేయడంతో రాజమండ్రి జైలులో ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్‌పై గుంటూరుకు తీసుకు వచ్చారు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి వాటిని పరిశీలించి 14 రోజుల పాటు రిమాండ్ తీర్పునివ్వడంతో అంబటిని తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు.
- Advertisement -
