ఓఎన్‌డీసీ ప్రారంభమై మూడేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ మార్కెట్(Market)లో నిలదొక్కుకునేందుకు ఇంకా పోరాడుతూనే ఉంది. అమెజాన్(Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipcart) వంటి ఇ-కామర్స్(E-Commerce) సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో తన పెర్‌ఫార్మెన్స్‌ని మెరుగుపరచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓఎన్‌డీసీకి ఫుల్‌ఫామ్.. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(Open Network for Digital Commerce). ఈ సంస్థ త్వరలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖతో చేతులు కలపనుంది. తద్వారా.. బిజినెస్(Business)ను పెంచుకోనుంది.
మార్కెట్‌లో తననుతాను నిరూపించుకోనుంది. గవర్నమెంట్‌తో టైఅప్ కావటం వల్ల పలు కోపరేటివ్ గ్రూపుల్లోని అమ్మకందారులు ఓఎన్‌డీసీలో నమోదవుతారు. ఓఎన్‌డీసీని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ప్రారంభించింది. ఇ-కామర్స్ కోసం పబ్లిక్ అండ్ ఓపెన్ సోర్స్‌డ్ నెట్‌వర్క్‌లాగ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల డామినేషన్‌కు చెక్ పెట్టడానికి ఓఎన్‌డీసీని రంగంలోకి దింపింది. చిన్న వ్యాపారాలను, చిన్న అమ్మకందారులను ప్రోత్సహించడం కోసం ప్లాట్‌ఫామ్ ఫీజును జీరో చేసింది. టయర్-2, టయర్-3 నగరాల్లోని స్మాల్ అండ్ మీడియం సెల్లర్స్‌ను ఆన్‌బోర్డ్ కావాలని ఆహ్వానించింది.
ఓఎన్‌డీసీ వచ్చిన కొత్తలో బాగానే అనిపించింది. కానీ.. ఈ ఏడాది తొలి నాళ్లలో ఓఎన్‌డీసీ రిటైల్ ఆర్డర్లు 12 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఏప్రిల్‌లో 4 పాయింట్ 3 మిలియన్ల ఆర్డర్లు రాగా అవి మే నెలలో 6 పాయింట్ 2 శాతం తగ్గి 4 మిలియన్లుగా నమోదయ్యాయి. 2024 అక్టోబర్ నెలలో ఓఎన్‌డీసీలోని మొత్తం లావాదేవీల్లో 47 శాతంగా ఉన్న రిటైల్స్ వాటా మే నెలకు వచ్చేసరికి కేవలం 25 శాతానికే పరిమితమైంది. ప్రభుత్వం ఎంత ప్రోత్సాహం అందిస్తున్నా.. కస్టమర్ల నుంచి ఆశించినంత స్పందన రావట్లేదు. అంతేకాదు. ఈ ప్లాట్‌ఫామ్ యూజర్ ఫ్రెండ్లీగా లేదని, కస్టమర్ సర్వీస్ సైతం పూర్‌గా ఉందనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
