HomeతెలంగాణDYFI | నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి..

DYFI | నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి..

  • డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎం.డి జావీద్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డి వై ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం డి జావీద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జావీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నిరుద్యోగులందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ని ప్రకటించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ నామమాత్రంగా ప్రకటించడం జరిగింది .ఇప్పటివరకు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ వెయ్యలేదు.

- Advertisement -
DYFI Signature Campaign For Employment Opportunities1

సమగ్రమైన వివరాలతో పూర్తి సమాచారంతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంతవరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా స్వయం ఉపాధి రుణాలపై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం లేదు..

DYFI Signature Campaign For Employment Opportunities0

దరఖాస్తులకే పరిమితం కాకుండా అర్హులైన నిరుద్యోగ యువత అందరికి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లాఉపాధ్యక్షులు దేవేందర్, రాజు, నాయకులు బాలకోటి, నరేష్, రాము, అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News