Homeఆదిలాబాద్Collector | ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదు

Collector | ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదు

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు.

Collector Abhilasha Abhinav Public Service Review

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు.

- Advertisement -
Collector Abhilasha Abhinav Public Service Review1

ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు తనికి చేస్తూ ఉండాలని తెలిపారు. వేసవి కాలం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలు గుర్తించి, నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు యూరియా యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఉండాలన్నారు.

Collector Abhilasha Abhinav Public Service Review2

జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా, ఇప్పటివరకు రైతులు, 1 లక్షా 60 వేల యూరియా బస్తాలు బుక్ చేసుకొని, 1 లక్షా 40 వేల యూరియా బస్తాలు తీసుకున్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నందున, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత మండలాల్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ ఉండాలన్నారు.

సీఎం కప్ పోటీలలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 4 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు కలిపి మొత్తం, 25 పతకాలు రావడం గర్వకారణం అని తెలిపారు. ఇందుకుగాను, అధికారులకు, కోచ్ లకు, క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.

Collector Abhilasha Abhinav Public Service Review34

అంతకుముందు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డిసిఓ నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కలెక్టర్, అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా అధికారి మృతి చెందడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News