Friday, April 24, 2026
Homeక్రైమ్ వార్తలుCyber Fraud | అధిక లాభాల ఆశజూపి నిలువునా మోసం..

Cyber Fraud | అధిక లాభాల ఆశజూపి నిలువునా మోసం..

  • రూ. 2.92 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు..
  • కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి సైబర్ క్రైం పోలీసులు..

సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.2.92 కోట్లు కొల్లగొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామంతాపూర్కు చెందిన శ్రీకాంత్ చక్రవర్తి ఐటీ ఉద్యోగి. ఇటీవల ఆయన వాట్సప్ నంబరును గుర్తు తెలియని వ్యక్తులు ‘రైడింగ్ ది విండ్ క్లబ్ పేరుతో ఉన్న ఓ గ్రూపులో చేర్చారు. ఈ గ్రూపులోని అనికాశర్మ ఇచ్చిన సూచనలతో ఐపీవో, స్టాక్మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ, ట్రేడింగ్ చేస్తూ భారీగా డబ్బు సంపాదించినట్లు కొందరు తరచూ పోస్టులు పెట్టేవారు. అదంతా నిజమేనని నమ్మిన శ్రీకాంత్ వారు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకుని తొలిసారి రూ.25 వేలతో షేర్లు కొన్నారు.

లాభం వచ్చినట్లు యాప్లో వర్చువల్గా చూపించేది. ఆ తర్వాత దేశంలోని అనేక ప్రముఖ కంపెనీల షేర్ల క్రయవిక్రయాల పేర్లతో నిందితులు డబ్బు బదిలీ చేయించుకున్నారు. ఇలా ఫిబ్రవరి 16 నుంచి ఈనెల 16 వరకూ శ్రీకాంత్ దశలవారీగా రూ.2.92 కోట్లు బదిలీ చేశారు. పెట్టుబడి, లాభం కలిపి రూ.3.52 కోట్లు వచ్చినట్లు యాప్లో చూపిస్తున్నా.. డబ్బు విత్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. బాధితుడికి అనుమానమొచ్చి ఆరా తీయగా అది మోసమని తేలింది. శ్రీకాంత్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News