Friday, April 24, 2026
Homeక్రైమ్ వార్తలుAffair | భర్త అక్రమసంబంధం బట్టబయలు..

Affair | భర్త అక్రమసంబంధం బట్టబయలు..

  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..

భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణ్ కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News