Thursday, February 12, 2026
HomeతెలంగాణRising Document | అభివృద్ధికి అద్దం పట్టాలి

Rising Document | అభివృద్ధికి అద్దం పట్టాలి

రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్, పాలసీ డాక్యుమెంట్‌ కనిపించాలని చెప్పారు.

  • రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.
  • కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE), పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ(PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)గా 3 ప్రాంతాలుగా విభజించుకోవాలని సూచించారు.
  • రాష్ట్ర సమగ్ర అభివృద్ది, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్దమౌతోంది.
  • అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్దే టార్గెట్‌గా రానున్న 22 ఏంఢ్ల కార్యాచరణను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది.
  • ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025(Telangana Rising Global Summit 2025)పై సీఎం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.
  • మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
  • సమావేశంలో పాలసీ డాక్యుమెంట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
  • ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.
  • తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నఅపారమైన అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఆవిష్కరించడంతోపాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు రోజుల సదస్సులో ప్రభుత్వం ప్రధానంగా వివరిస్తుంది.
  • హైదరాబాద్‌ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణను 3 జోన్లుగా అభివృద్ది సమతుల్యత సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • అదే సమయంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా విజన్ డాక్యుమెంట్‌లో భాగమవుతుంది.
  • ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధ(AI), స్టార్టప్, MSMEలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాల్లో రానున్న 2 దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలకమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
  • బ్లూ & గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్‌లో మూసీ పునరుజ్జీవం, దీనిలో భాగంగా 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డు, హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లు, రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది.
  • వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతోంది.
  • ఏటా 2 లక్షల మంది యువతకు, లక్ష మంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ది టార్గెట్‌గా ప్రణాళికల రూపకల్పన.
  • హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజీల నిర్మాణం.
  • మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు అంశాల్లో స్పష్టమైన భవిష్యతు ప్రణాళికలు రూపొందించారు.
  • అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ది, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్‌ను క్రియేట్ చేయటం.
  • బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పించారు.
  • ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు.
  • రాష్ట్రంలోని ప్రతీ గ్రామంతోపాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ వరకు సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 మార్గదర్శకంగా ఉండాలని సీఎం స్పష్టంగా చెప్పారు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News