- మొదటి రోజు జిల్లాలోని 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీలకు 207 నామినేషన్లు
- 1442 వార్డులకు 38 నామినేషన్లు దాఖలు
- తొండ తిరుమలగిరిలో మొదటి రోజు వార్డ్ మెంబర్‌కు రాని నామినేషన్లు
సూర్యాపేట ప్రతినిధి, నవంబర్ 27(ఆదాబ్ హైదారాబాద్): సర్పంచ్ ఎన్నికల(Sarpanch Elections) వేళ జిల్లాలో నామినేషన్ల స్వీకరణ జోరుగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్(State Election Commission) విడుదల చేసిన షెడ్యూల్(Schedule) ప్రకారం నవంబర్ 27న తొలి రోజు జిల్లాలోని 8 మండలాల్లో మొత్తం 159 గ్రామ పంచాయతీ(Gram Panchayat)లకు నోటిఫికేషన్ (Notification) జారీ అయింది. మొదటి రోజే 207 నామినేషన్లు స్వీకరించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ పర్యవేక్షణలో నామినేషన్ కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మండలాల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
తుంగతుర్తి మండలంలో 24 గ్రామ పంచాయతీలకు 24 నామినేషన్లు
నాగారంలో 14 జీపీలకు 30
నూతనకల్‌లో 17 జీపీలకు 34
తిరుమలగిరిలో 16 జీపీలకు 17
జాజిరెడ్డిగూడెంలో 17 జీపీలకు 15
మద్ధిరాలలో 16 జీపీలకు 17
సూర్యాపేట మండలంలో 25 జీపీలకు అత్యధికంగా 40 నామినేషన్లు
ఆత్మకూరు(ఎస్)లో 30 జీపీలకు 30 నామినేషన్లు
మొత్తమ్మీద 159 గ్రామ పంచాయతీలకు 207 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ గడువు ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలోని నామినేషన్ కేంద్రాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రక్రియ సాగుతోందని, అభ్యర్థులకు కావాల్సిన సహకారం అందిస్తున్నామని చెప్పారు.
వార్డు మెంబర్ నామినేషన్లు..
గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం జిల్లాలో శాంతియుతంగా మొదలైంది. మొదటి రోజు నామినేషన్ల స్వీకరణలో మొత్తం 8 మండలాల్లో 38 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 1442 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేశారు. తొలి రోజే వివిధ మండలాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
మండలాల వారీగా వార్డ్ మెంబర్ల నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
తుంగతుర్తి మండలంలో 218 వార్డులకు 9 నామినేషన్లు
నాగారం మండలంలో 132 వార్డులకు 4 నామినేషన్లు
నూతనకల్ మండలంలో 166 వార్డులకు 8 నామినేషన్లు
తిరుమలగిరి మండలంలో 132 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా రాలేదు.
జాజిరెడ్డిగూడెం మండలంలో 152 వార్డులకు 3 నామినేషన్లు
మద్దిరాల మండలంలో 148 వార్డులకు 2 నామినేషన్లు
సూర్యాపేట మండలంలో 220 వార్డులకు 7 నామినేషన్లు
ఆత్మకూరు(ఎస్) మండలంలో 274 వార్డులకు 5 నామినేషన్లు
జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 8 మండలాల్లోని 1442 వార్డ్‌లకు 38 వార్డ్ సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుమలగిరి(టి) మండలంలో ఒక్క వార్డు సభ్యుడి నామినేషన్ కూడా రాకపోవడం విశేషం. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ సాగినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. నామినేషన్లు స్వీకరణ గడువు ఇంకా 2 రోజులు ఉండటంతో మిగతా రోజుల్లో నామినేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

