Friday, May 29, 2026
Homeఆంధ్రప్రదేశ్Delhi Visit | ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు..

Delhi Visit | ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు..

  • కీలక జలవివాదాలపై కేంద్రంతో చర్చ..
  • సి ఆర్ పాటిల్ తో ప్రత్యేకంగా సమావేశం..

సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు.

అదే సమయంలో గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మటి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలని కూడా కేంద్ర మంత్రిని చంద్రబాబు అభ్యర్థించనున్నారు. వీటితో పాటు ఢిల్లీలో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News