ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేటలో “క్యాంపస్ ఎకో బజార్” కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కే.రీనా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హాజరుకాగా ఏకో క్లబ్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎం రాంబాబు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఒక పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం, తెలంగాణ పర్యావరణ అటవీ శాఖ సౌజన్యంతో క్యాంపస్ ఎకో బజార్ ప్రోగ్రామ్ అనేది కళాశాల ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంఅని, దీని ద్వారా పర్యావరణం పై అవగాహన, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి విద్యార్థులలో, అధ్యాపకులలో అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థుల యొక్క సృజనాత్మక, వ్యవస్థాపక నైపుణ్యాలను వెలికి తీయడంలో భాగంగా విద్యార్థులు తయారుచేసిన పర్యావరణ అనుకూల వస్తువులు మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రదర్శించి స్టాల్ల్స్ ద్వారా జనపనార మరియు కాటన్ సంచులు, మట్టి ప్రమిదలు, మరియు పునర్వినియోగపరచిన వస్తువులతో చేసిన అలంకరణ సామాగ్రి మరియు ఆరోగ్యకరమైన, సంప్రదాయ మరియు ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాల ప్రదర్శన విద్యార్థుల ఆసక్తిని తెలియచేసిందిని పేర్కొన్నారు.
ముఖ్య అతిథి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే. రీనా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, స్థానిక ఉత్పత్తుల వాడకం మరియు విద్యార్థులలో పర్యావరణ స్పృహను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయాని,పర్యావరణంతో సంబంధం ఉన్న అధికారినిగా కొత్త అనుభూతిని పొందానాని విద్యార్థుల యొక్క ప్రదర్శన చాలా బాగుందని ప్రశంసించారు. క్యాంపస్ ఎకో బజార్ జిల్లా బాధ్యులు డాక్టర్ ఎం రాంబాబు మాట్లాడుతూ పర్యావరణ పరి రక్షణ అందరి బాధ్యతఅని విద్యార్థులలో పర్యావరణాలపై అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడ తామని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.
