Tuesday, January 13, 2026
EPAPER
Homeతెలంగాణఆధునిక గోశాల నిర్మించండి

ఆధునిక గోశాల నిర్మించండి

సీఎం రేవంత్‌కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతి

వేములవాడలోన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నిర్మాణం కోసం వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్లు ఆయన దృష్టికి తెచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎంని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News