Tuesday, December 9, 2025
EPAPER
Homeహైదరాబాద్‌Borra Gnaneshwer | ముదిరాజ్ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్న

Borra Gnaneshwer | ముదిరాజ్ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్న

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ను గురువారం హైదరాబాదులోని డిప్యూటీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ మేరకు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ కులస్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను బండ ప్రకాష్ ముదిరాజ్ కు వివరించారు.ఈ భేటీలో ప్రత్యేకంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, అలాగే ముదిరాజులను బీసీ–డి నుంచి బీసీ–ఏ వర్గానికి మార్చే అంశంపై విస్తృతంగా చర్చించారు.

బొర్రా జ్ఞానేశ్వర్ ప్రస్తావించిన అంశాలపై డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ సాను కూలంగా స్పందించారు..ముదిరాజ్ సమాజ అభివృద్ధి కోసం తనవంతు బాధ్యతను శక్తి వంచనలేకుండా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.అలాగే ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి తనవంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ తో పాటు పలువురు ముదిరాజ్ కుల సంఘాల పెద్దలు,వివిధ పార్టీల నాయకులు, ముదిరాజ్ సామాజికవేత్తలు, మేధావులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News