Wednesday, April 15, 2026
Homeక్రైమ్ వార్తలుKarnataka | ప్రియుడితో కలిసి పారిపోయిన మహిళా..

Karnataka | ప్రియుడితో కలిసి పారిపోయిన మహిళా..

  • కక్షగట్టిన కుటుంబ సభ్యులు..

ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె ఆచూకీని వారు గుర్తించారు. గుట్టుగా ఒక చోటకు తీసుకెళ్లారు. విషం ఇచ్చి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేశారు. ప్రియుడి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుకేరికి చెందిన సత్యవ్వకు సంతోష్ హెలవితో నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే ప్రియుడు కృష్ణ పాటిల్‌తో వివాహేతర సంబంధాన్ని ఆమె కొనసాగించింది.

కాగా, ఫిబ్రవరిలో ప్రియుడు కృష్ణతో కలిసి సత్యవ్వ పారిపోయింది. దీంతో ఆమె అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారిద్దరూ కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు అత్తింటి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో సత్యవ్వకు నచ్చజెప్పి ఆమెను వెనక్కి తెచ్చారు.

- Advertisement -

మరోవైపు ప్రియుడితో సత్యవ్వ పారిపోయి తమ కుటుంబానికి పరువునష్టం కలిగించిందని అత్తింటి వారు కలతచెందారు. ఈ నేపథ్యంలో ఆమెను మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ప్రియుడు కృష్ణతో సంబంధాన్ని ముగించాలని చెప్పారు. నిరాకరించిన ఆమె కృష్ణ వద్దకు వెళ్తానని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News