Homeహైదరాబాద్‌Students Protest | శక్తికి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Students Protest | శక్తికి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

  • జీఓ 97ను రద్దు చేయాలి
  • యధాతధంగా పాలిటెక్నిక్ కావాలి
  • ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో శాంతి యుత నిరసన

శక్తి శాఖలో పాలిటెక్నిక్ కాలేజీల విలినానికి వ్యతిరేఖంగా సికింద్రాబాద్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సికింద్రాబాద్ లోని సంగీత్ కూడలి సమీపంలో ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో మారేడ్ పల్లి కళాశాల విద్యార్థినులు బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీ ఓ 97 ను వెంటనె రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐడీఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు విశాలి మాట్లాడుతూ జీఓ నెం 97ను గుట్టు చప్పుడు కాకుండా తీసుకు వచ్చి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నో కలలు గని మంచి ర్యాంకులు సాధించి పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థానాలకు ఎదగాలనుకుంటున్న విద్యార్థుల స్వప్నాలను చెల్లా చదరు చేయాలని చూస్తుందని ఆరోపించారు. జీఓ నెం 97 ద్వారా ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో విలీనం చేయడం దుర్మార్గమని అన్నారు. పేద మధ్యతరగతికి చెందిన ఎంతో. మంది విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యానభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకొని దేశానికి సేవ చేసారని గుర్తు చేశారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెహ్రూ తీసుకు వచ్చిన పాలిటెక్నిక్ విద్యా విధానం అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సిగ్గు చేటని వెల్లడించారు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి కూడా వీలు లేకుండా చేయడం గర్హనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ జీఓను వెనక్కు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, జీవోను రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐడీఎస్ఓ నగర కార్యదర్శి నాగరాజు పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ తమ నిరసనను శాంతియుతంగా వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులకు చోటు ఇవ్వనియకుండా తుకారాం గేట్ ఇన్ స్పెక్టర్ బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News