Wednesday, March 4, 2026
HomeతెలంగాణTelangana | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై ఉత్కంఠ!

Telangana | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై ఉత్కంఠ!

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత (Disqualification) పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) నేడు తీర్పు ప్రకటించనున్నారు. మరికొద్దిసేపట్లో (మధ్యాహ్నం మూడున్నరకు) తన నిర్ణయాన్నివెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమయానికి స్పీకర్‌ కార్యాలయానికి (Speaker Office) బీఆర్ఎస్ (BRS), ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు రానున్నారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావ్‌(భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల్), ప్రకాష్‌ గౌడ్‌(రాజేంద్రనగర్), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు)పై బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు దాఖలుచేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ ఇవ్వనున్న తీర్పు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆ ఐదుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES

Latest News