Homeవరంగల్‌Mulugu | భూ అక్రమాలు ప్రశ్నిస్తే…"కడతెర్చేందుకు "కక్ష" కట్టారు

Mulugu | భూ అక్రమాలు ప్రశ్నిస్తే…”కడతెర్చేందుకు “కక్ష” కట్టారు

  • నాకు ప్రాణ హాని ఉంది రక్షణ కల్పించండి

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని ఓ ప్రముఖ వ్యక్తి (రేషన్ డీలర్ భర్త) లేని భూములకు ఆన్లైన్ లో అక్రమ పట్టాలు (భూ కుంభకోణం) అక్రమాలకు పాల్పడగా, ఆ అక్రమాలను అధికారులకు వెల్లడించి,మీడియా ముఖంగా తాను ప్రశ్నించినందుకు తనను అడ్డుతొలగించేందుకు (చంపేందుకు) “సుఫారీ” గ్యాంగ్ తో ప్రయత్నిస్తున్నారని కమలాపురంకు చెందిన సీతక్క యువసేన మంగపేట అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నేత సిద్దాబత్తుల జగదీశ్వర రావు ఆందోళన, ఆవేదన తో ఆరోపించారు.

ఈ మేరకు మండలంలోని కమలాపురంలో బుధవారం విలేకరుల సమావేశంలో సిద్దాబత్తుల జగదీశ్వర రావు మాట్లాడుతూ కమలాపురంకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి, అతని భార్యకు భూమి లేకున్నా ఆ వ్యక్తి పేరుపై, అతని భార్య పేరుపై మంగపేట మండలంలోని చెరుపల్లి రెవెన్యూ గ్రామ పరధిలో సుమారు 14 ఎకరాలు, కమలాపురంలో రెవెన్యూ గ్రామ పరధిలో సుమారు 5 ఎకరాల మేరకు లేని భూమి ఉన్నట్లు, అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్నారని అన్నారు.

- Advertisement -

ఆ పట్టాదారు పాసు పుస్తకాలతో సదరు వ్యక్తి, అతని భార్య ప్రతీ ఏటా రెండుసార్లు “రైతుబంధు” (రైతుభరోసా) తోపాటు ఆయా జాతీయ బ్యాoకు ల్లో వ్యవసాయ రుణాలు,వ్యవసాయ రుణమాఫీ పొందుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మంగపేట తహసీల్ కార్యాలయంలో ఇటీవలే తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో సదరు వ్యక్తికి, అతని భార్యకు తాము నోటీసులు పంపగా ఆ ఇద్దరు తగిన ఆధారాలు చూపించడం లేదని మంగపేట తహసీల్దార్ తనకు ఒక లెటర్ (నోటీసులు) ఇచ్చారని సిద్దాబత్తుల జగదీశ్వర రావు తెలిపారు.

Mulugu Leader Alleges Land Scam and Threat to Life

ఆ లెటర్ ను తాను ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజావాణి” కార్యక్రమంలో అందజేశానని సిద్దాబత్తుల జగదీశ్వర రావు తెలిపారు . దీంతో సదరు వ్యక్తి, అతని స్నేహితుడు మరికొందరు “సుఫారీ” గ్యాంగ్ వ్యక్తుల తో కలిసి తనను బెదిరిస్తూ,అదిరిస్తూ చంపేందుకు, అడ్డుతొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన,ఆందోళన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి, అతని స్నేహితుల వలన తనకు ప్రాణ హాని ఉందని మంగపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేసినట్లు సిద్దాబత్తుల జగదీశ్వర రావు తెలిపారు.

ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి భూమి లేకున్నా “రైతు బంధు”, “రుణమాఫీ” “వ్యవసాయరుణాలు” పొందిన సదరు అక్రమ వ్యక్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అక్రమంగా పొందిన రైతుబంధు, రుణమాఫీ,వ్యవసాయ రుణాల తగ్గింపు వడ్డీరేట్ల మొత్తం డబ్బులను రికవరీ చేయాలని ఆయన రెవెన్యూ ,పోలీస్,ఆయా బ్యాంకు శాఖల అధికారులను ఆయన డిమాండ్ చేశారు, అయితే ఈలోపు వారివల్ల తనకు ప్రాణ హాని ఉందని కావున తనకు పోలీసులు తగిన రక్షణ కల్పించాలని సిద్దాబత్తుల జగదీశ్వర రావు ఈసందర్భంగా విలేకరులతో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News