Homeనల్లగొండAlair | చీకటిలో అంత్యక్రియలు…

Alair | చీకటిలో అంత్యక్రియలు…

  • స్మశాన వాటికలో వెలుగుల కోసం మాజీ కౌన్సిలర్ వినతి.

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని స్మశాన వాటికలో రాత్రివేళల్లో నెలకొంటున్న చీకటి సమస్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, కుటుంబ సభ్యులు అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యపై మాజీ కౌన్సిలర్ సంగు భూపతి స్పందించారు.

గత రెండు నెలల క్రితం స్మశాన వాటికలో చీకటి సమస్యను గుర్తించిన సంగు భూపతి, తన స్వంత ఖర్చుతో నాలుగు విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేశారు. అయితే ఆ స్థంభాలకు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో అవి ఉపయోగంలోకి రాలేదు. దీంతో రాత్రివేళల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే, ప్రజలు మొబైల్ ఫోన్ల లైట్లు లేదా చితి మంటల వెలుగుతోనే కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందని ఆయన తెలిపారు.

- Advertisement -
Alair Cemetery Lighting Issue Former Councilor Sangu Bhupathi Appeal2

ఈ పరిస్థితి ఎంతవరకు బాధాకరమో వివరిస్తూ, అంత్యక్రియల వంటి సున్నితమైన సమయంలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం మున్సిపల్ పరిపాలనలో లోపాలను చూపిస్తోందని విమర్శించారు. స్మశాన వాటికలో సరైన లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశమూ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు ఆలేరు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. తాను ఏర్పాటు చేసిన నాలుగు స్థంభాలకు విద్యుత్ కేబుల్ కల్పించి, వీధి దీపాలు అమర్చాలని అధికారులను కోరారు. సుమారు రూ.15 వేల వ్యయంతో చిన్న స్థాయి లైటింగ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపశమనం లభిస్తుందని సూచించారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి స్మశాన వాటికలో వెలుగుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News