Tuesday, April 21, 2026
Homeనల్లగొండCongress | అశ్వరావుపల్లి సర్పంచ్ చైతన్య రాజు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

Congress | అశ్వరావుపల్లి సర్పంచ్ చైతన్య రాజు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనీ రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామ సర్పంచ్ చైతన్య రాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.హన్మకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో చైతన్య రాజు కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలోకి అధికారికంగా చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కూడా హాజరై, వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.

సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన చైతన్య రాజు ఇప్పుడు అధికార పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ చేరిక దోహదపడుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, “కొత్తవారు, పాతవారు అనే తేడా లేకుండా అందరూ కలిసి గ్రామ అభివృద్ధికి పనిచేయాలి” అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నీతి, నిజాయితీతో సేవ చేయాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి, సీనియర్ నాయకులు నామాల బుచ్చయ్య, ఇతర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News