- అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్రంలో సినిమా ప్రారంభం..Arjun Sarja 175th Film
- యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ..
భారత సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, అయోధ్యలోని పవిత్ర శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో ఓ సినిమా ముహూర్త కార్యక్రమం జరిగింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో తెరకెక్కనున్న భారీ చిత్రానికి ఇక్కడ పూజా కార్యక్రమాలతో అంకురార్పణ చేశారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అనూప్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకుడు, నటుడు అర్జున్ సర్జా తన భార్య నివేదిత అర్జున్తో కలిసి హాజరయ్యారు. పలువురు ప్రముఖులు, అతిథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరంలో ఒక సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం ఇదే తొలిసారని, ఇది తమకు దక్కిన గౌరవమని చిత్రబృందం పేర్కొంది. దేశభక్తిని చాటే ఈ సినిమాకు ఇంతకంటే పవిత్రమైన ప్రారంభం ఉండదని వారు అభిప్రాయపడ్డారు.Arjun Sarja 175th Film
ఈ చిత్రం అర్జున్ సర్జా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనది. ఇది ఆయన కెరీర్లో 175వ సినిమా కావడం విశేషం. గతంలో ‘జై హింద్’ వంటి చిత్రాలతో దేశభక్తి కథలకు చిరునామాగా నిలిచిన అర్జున్, మరోసారి అదే తరహా కథాంశాన్ని ఎంచుకున్నారు. సైన్యంలో చేరాలన్న తన ఆసక్తిని, సినిమా ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపాలన్న తన తపనను ఈ ప్రాజెక్ట్ ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ చిత్రానికి రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవ్ కథ అందించడం మరో ముఖ్యమైన అంశం. ఆయన సైనిక అనుభవం ఈ కథకు వాస్తవికతను, లోతును అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రధానంగా హిందీలో రూపొందుతున్న ఈ సినిమాను మొత్తం 9 భారతీయ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా టైటిల్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.Arjun Sarja 175th Film(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
