- ఆడా.. మగా.. అంతా సమానమే!Gender Equality Awareness
- లింగ వివక్షకు స్వస్తి.. సమానత్వమే లక్ష్యం!
- మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి!Gender Equality Awareness
- ఆడపిల్లకు ఆకాశమే హద్దు.. సమాన హక్కులే పునాది!
- సమానత్వ సమాజమే మన సంకల్పం!
- బాలబాలికల మధ్య తేడా చూపొద్దు.. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్Gender Equality Awareness
సమాజంలో మహిళలు, పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తూ లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జెండర్ సమానత్వంపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా శంకర్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో మహిళా (Gender Equality Awareness) ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని మహిళా సర్పంచులు, మహిళా ఉపసర్పంచులు, మహిళా కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో జెండర్ సమానత్వంపై నిరంతరం చర్చలు నిర్వహించాలని సూచించారు.మహిళలు, పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే నిజమైన సమానత్వమని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో మహిళా ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని కోరారు.
గ్రామస్థాయిలో కుటుంబాల నుంచి సమాజం వరకు లింగ వివక్షను రూపుమాపేందుకు చొరవ చూపాలని సూచించారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆడపిల్లలు,మగపిల్లలను పెంచి పోషించేది తల్లులేనని, అలాంటప్పుడు వారి మధ్య తేడాలు చూపడం సరికాదన్నారు. తల్లులుగా, ప్రజాప్రతినిధులుగా బాలబాలికలను సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల సమావేశాలకు కిశోర బాలికలను ఆహ్వానించి, వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి స్థానిక సంస్థలు చొరవ తీసుకోవాలన్నారు.
చిన్ననాటి నుంచే సమానత్వ భావన!Gender Equality Awareness
ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరూ సమానమేననే భావనను చిన్నతనం నుంచే కుటుంబాల్లో, పాఠశాలల్లో,సమాజంలో పెంపొందించాలని వక్తలు సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో జెండర్ ఈక్వాలిటీపై చర్చలు నిర్వహిస్తూ మహిళల హక్కులు, బాలికల భద్రత, విద్య, అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.Gender Equality Awareness
మహిళా ప్రజాప్రతినిధులు కేవలం పాలనకే పరిమితం కాకుండా సామాజిక మార్పుకు మార్గదర్శకులుగా నిలవాలని, సమానత్వ భావనను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సమావేశంలో సూచించారు.మహిళల భాగస్వామ్యంతోనే సమాన హక్కులు, సమాన అవకాశాలు కలిగిన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
