- పాకిస్తాన్ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు..Bangladesh Speaker Remarks
- బంగ్లా విమోచనలో భారత్ తమకు సహాయం చేయలేదని ఆరోపణ..
బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్, పాకిస్థాన్ పర్యటనలో భారత్‌పై తీవ్రమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971 బంగ్లా విమోచన యుద్ధంలో భారత్ తమకు సహాయం చేయలేదని, కేవలం పాకిస్థాన్‌ను బలహీనపరిచేందుకే పనిచేసిందని ఆయన ఆరోపించారు. ఇస్లామాబాద్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.Bangladesh Speaker Remarks
బుధవారం ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ హౌస్‌ను సందర్శించిన సందర్భంగా హఫీజుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బీబీసీ ఉర్దూ’ కథనం ప్రకారం.. “1971లో భారత్ బెంగాలీలకు సహాయపడలేదు, పాకిస్థాన్‌ను బలహీనపరిచింది” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ వాస్తవంగా భారత్‌కు ఒక ‘కాలనీ’గా మారిందని ఆరోపించారు. గతంలో బంగ్లాదేశ్‌లో నిజమైన ప్రజాస్వామ్యం లేదని, 1975లోనే ఏక పార్టీ వ్యవస్థను ప్రవేశపెట్టారని విమర్శించారు. అయితే, 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు మాత్రం స్వేచ్ఛగా జరిగాయని చెప్పడం గమనార్హం.Bangladesh Speaker Remarks
పాకిస్థాన్ గడ్డ మీద భారత్‌పై విమర్శలు గుప్పించిన హఫీజుద్దీన్ అహ్మద్ ఒకప్పుడు పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేయడం విశేషం. 1971 యుద్ధ సమయంలో ఆయన పాక్ సైన్యం నుంచి బయటకు వచ్చి బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడారు. ఆ యుద్ధంలో చూపిన ధైర్యానికి ఆయన బంగ్లాదేశ్‌లో గౌరవ పురస్కారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన గతాన్ని, ఆయన పాత మాటలను పూర్తిగా విస్మరించేలా ఉన్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
