Homeఅంతర్జాతీయంUK Student Visa | భారత విద్యార్థులకు కష్టకాలం..

UK Student Visa | భారత విద్యార్థులకు కష్టకాలం..

  • యూకేలో నిబంధనలు కఠినతరం..UK Student Visa
  • ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు షాక్..

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు దారులు కఠినంగా మారుతున్నాయి. యూకే ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో, భారతీయ విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ వీసాల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. ఈ నెల‌ 26న యూకే హోం ఆఫీస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 సెప్టెంబరు నుంచి 2026 సెప్టెంబర్ వరకు భారతీయ విద్యార్థులకు మంజూరు చేసిన స్టూడెంట్ వీసాలు 29 శాతం తగ్గాయి.UK Student Visa

గణాంకాల ప్రకారం, ఈ కాలంలో భారతీయ ప్రధాన దరఖాస్తుదారులకు కేవలం 69,855 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. ఇది మొత్తం వీసాలలో 22 శాతం వాటా. అంతర్జాతీయ విద్యార్థులను పంపడంలో చైనా (24 శాతం) మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ (6 శాతం), నైజీరియా (5 శాతం), అమెరికా (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మీద, యూకే జారీ చేసిన స్పాన్సర్డ్ స్టడీ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23 శాతం క్షీణించి 335,801కి చేరింది. వీసాల సంఖ్య తగ్గడమే కాకుండా, వీసా తిరస్కరణలు, అప్లికేషన్ల ఉపసంహరణలు కూడా గణనీయంగా పెరిగాయి.UK Student Visa

- Advertisement -

హోం ఆఫీస్ డేటా విశ్లేషణ ప్రకారం, 2025 సెప్టెంబర్-2026 సెప్టెంబర్ మధ్య కాలంలో వీసా తిరస్కరణల రేటు 6.4 శాతానికి చేరింది. ఇది అంతకు ముందు ఏడాది 3.1 శాతంగా ఉండగా, ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. 2015 తర్వాత ఇదే అత్యధిక తిరస్కరణల రేటు. అంతేకాకుండా, దరఖాస్తుల ఉపసంహరణలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. 2026 జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 3,682 దరఖాస్తులు నిర్ణయం వెలువడక ముందే ఉపసంహరించుకున్నారు. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య కేవలం 779గా ఉండగా, ఇప్పుడు ఏకంగా 370 శాతం పెరుగుదల కనిపించింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News