Homeకరీంనగర్Korutla Missing Boy | తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన కోరుట్ల పోలీస్ పెట్రోలింగ్...

Korutla Missing Boy | తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన కోరుట్ల పోలీస్ పెట్రోలింగ్ పార్టీ

  • అర్ధరాత్రి వరకు ఆందోళనలో తల్లిదండ్రులుKorutla Missing Boy
  • కల్లూరు రోడ్డులో బాలుడిని గుర్తించి ఇంటికి చేర్చిన పోలీసులు
  • పోలీసుల సేవలకు తల్లిదండ్రులు, కాలనీవాసుల అభినందనలు

తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలుడిని పోలీస్ పెట్రోలింగ్ పార్టీ క్షేమంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల సమయస్ఫూర్తి, మానవీయ సేవలకు బాలుడి తల్లిదండ్రులతో పాటు కాలనీవాసులు అభినందనలు తెలిపారు.Korutla Missing Boy

వివరాలలోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని హాజీపూర్‌కు చెందిన గుంటుక మహేష్ కుమారుడు గుంటుక మహాన్ (8) గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటల వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

- Advertisement -

ఈ క్రమం లో పట్టణంలోని కల్లూరు రోడ్డులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి బాలుడు కనిపించాడు. వెంటనే బాలుడి వివరాలు తెలుసుకుని, అతడిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.

చాలాసేపటి నుంచి కనిపించకుండా పోయిన తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. పెట్రోలింగ్ సిబ్బంది చూపిన బాధ్యతాయుతమైన సేవలను కాలనీవాసులు అభినందించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News