Homeరంగారెడ్డిSabitha Indra Reddy Support | సబితా ఇంద్రారెడ్డి,కార్తీక్ రెడ్డిల సహకారాన్ని మరిచిపోయారా?

Sabitha Indra Reddy Support | సబితా ఇంద్రారెడ్డి,కార్తీక్ రెడ్డిల సహకారాన్ని మరిచిపోయారా?

  • వివక్ష గురించి మాట్లాడే ముందు అభివృద్ధిపై సమాధానం చెప్పండి!Sabitha Indra Reddy Support
  • అభివృద్ధిపై చర్చకు సిద్ధం..ఎమ్మెల్యే బహిరంగంగా సమాధానం చెప్పాలి.
  • హామీల అమలులో వైఫల్యం..అభివృద్ధి పనుల్లో జాప్యం..పదవుల కేటాయింపులోనూ వివక్షేనా?
  • మాజీ ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి ఘాటు విమర్శలు

వివక్ష గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని,నిధుల కేటాయింపులోనే కాకుండా రాజకీయంగా,పదవుల పంపిణీలోనూ వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.శంకర్‌పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడే ముందు గతంలో ఆమె చేసిన రాజకీయ సహకారాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.సబితా ఇంద్రారెడ్డి,కార్తీక్ రెడ్డి ఎన్నికల సమయంలో సహకరించకపోయి ఉంటే ఎమ్మెల్యే గెలుపు సాధ్యమయ్యేదా?అని ప్రశ్నించారు.రాజకీయంగా అండగా నిలిచిన వారి మేలును మరిచి వారిపైనే విమర్శలు చేయడం తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లుగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పనుల్లో జాప్యం…అభివృద్ధి చేశాకే విమర్శలు చేయాలి!

- Advertisement -

అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్పుకునే ఎమ్మెల్యే..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను తమ ఖాతాలో వేసుకోవడం కాకుండా,ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా చేసిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టంగటూరు బ్రిడ్జికి ఇప్పటికీ కనెక్టివిటీ రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.శంకర్‌పల్లి–మోమిన్‌పేట్, పర్వేద–అంతప్పగూడ,దోబీపేట్–గాజులగూడ,చందిప్ప తదితర గ్రామాల ప్రధాన రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.రోడ్లపై ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు.కేవలం శాంక్షన్ లెటర్లకే పరిమితమవుతున్నారని,క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు.రహదారుల దుస్థితితో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నా పాలకుల్లో చలనం లేదన్నారు.

ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?Sabitha Indra Reddy Support

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఏమైంది?Sabitha Indra Reddy Support
  • పెంచుతామన్న పింఛన్ల హామీ ఏమైంది?
  • కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఎక్కడ?
  • రైతులకు రైతు బీమా, రైతు భరోసా పరిస్థితి ఏమిటి?
  • రైతు భరోసా ఎన్ని విడతల్లో అందించారు?
  • బతుకమ్మ చీరల పంపిణీ ఏమైంది?
  • రంజాన్ తోఫా పథకం ఏమైంది?

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇతరులపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

పదవుల కేటాయింపులోనూ వివక్షేనా?(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News