Homeనల్లగొండMattapalli Temple Kalyanam | మట్టపల్లి మహా క్షేత్రంలో వైభవంగా పార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణం...

Mattapalli Temple Kalyanam | మట్టపల్లి మహా క్షేత్రంలో వైభవంగా పార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణం…

  • ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ ప్రాంగణం…Mattapalli Temple Kalyanam

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మఠంపల్లి మండల పరిధి మట్టపల్లి మహాక్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.మంగళ వారం తెల్లవారుజామున శ్రీ స్వామివారికి నిత్యాభిషేకాలు,నిత్య హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం కార్తీక దీపారాధన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.Mattapalli Temple Kalyanam

అనంతరం రాత్రి 7 గంటలకు దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన కల్యాణ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా 230 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు విజయ్ కుమార్,దేవస్థాన అర్చకులు,సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News