HomeతెలంగాణNasha Mukt Bharat | నషాముక్త భారత్..

Nasha Mukt Bharat | నషాముక్త భారత్..

  • రేపు హైదరాబాద్ లో పాదయాత్ర..Nasha Mukt Bharat
  • వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

దేశ యువతను పెనుభూతంలా వేధిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతోంది. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ నగరంలో రేపటి (నవంబర్ 25) నుంచి మూడు రోజుల పాటు ‘నషా ముక్త భారత్’ పాదయాత్ర నిర్వహించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త భారత్’ పేరిట చేపట్టే ఈ యాత్ర రేపు అంబర్‌పేట్‌లో ప్రారంభమై, నవంబర్ 27న జూబ్లీహిల్స్‌లో ముగుస్తుంది. సుమారు 30 కిలోమీటర్ల మేర నగరంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది.Nasha Mukt Bharat

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘నషా ముక్త భారత్ అభియాన్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ యువతను వేధిస్తున్న సవాళ్లలో డ్రగ్స్ అతి ప్రధానమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది యువత మత్తుపదార్థాల బారినపడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి కారణంగా పంజాబ్ రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, అటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాలకు రాకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ‘నషా ముక్త్ భారత్’ కోసం పనిచేయాలని నిర్ణయించారని ఆయన వివరించారు. డ్రగ్స్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు. 2029 నాటికి దేశాన్ని మత్తుపదార్థాలు లేని సమాజంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మహమ్మారిపై సాగే పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రకు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్‌లతో పాటు పలువురు క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఇప్పటికే తమ పూర్తి మద్దతు ప్రకటించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News