- బ్యాంకు షేర్ లు, మెటల్ స్టాక్స్ అమ్మకాలు కారణం..Indian Stock Market
- లాభాల్లో టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి ఇతరాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి (Indian Stock Market). ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా నష్టాల్ల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్లు, మెటల్ స్టాక్స్ లో అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. నిఫ్టీ 350 పాయింట్లపైగా నష్టాల్లో ట్రేడవుతున్నది. వరుసగా గత రెండు సెషన్లలో రాణించిన మార్కెట్లు ఇవాళ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం మార్కెట్ల పతనానికి కారణమైంది. ఈ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సెన్సెక్స్ 1180 పాయింట్ల నష్టంతో 82,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 25,447.00 వద్ద కొనసాగుతున్నది. ఇంట్రాడేలో 84,662.96 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ 82,893.33 వద్ద కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నిఫ్టీ ఈ నెలలో దాదాపు పది శాతం పెరిగింది. రెండు బెంచ్ మార్క్ సూచీలు జీవనకాల గరిష్ఠాలకు 2, 3 శాతం దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం మార్కెట్లను నష్టపర్చింది. విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా 15 సెషన్లలో కొనుగోళ్లకు దిగారు. ఈ నెలలో రూ.1.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. అధిక వెయిటేజీతో కూడిన షేర్లు కుంగడం వల్ల కూడా సూచీలపై ఒత్తిడి పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీ బ్యాంక్ షేర్లు 2.5 శాతం మేర క్షీణించాయి. డిసెంబర్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యూఎస్‌లో వడ్డీ రేట్లు పెరిగితే అమెరికా ఆస్తులు ఆకర్షణీయంగా మారి, విదేశీ పెట్టుబడులు భారత్ నుంచి తరలిపోయే ప్రమాదం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
