- విద్యావంతులు, బహుజనులకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించేది మేమే.Akash Kolluru
- ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం.
- తెలంగాణ రక్షణ సేన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు..Akash Kolluru
విద్యావంతులు, బహుజనులకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడంలో ప్రధాన రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, తెలంగాణ రక్షణ సేన మాత్రమే వారికి రాజకీయ అవకాశాలు కల్పిస్తోందని హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు (Akash Kolluru) అన్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాలు ఉండాలని, రాజకీయాల్లో సామాన్యులకు కూడా సముచిత స్థానం కల్పించాలన్నారు.
సోమవారం వనపర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో గళమెత్తుతానని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 43 రోజులకు ఒకసారి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి ఇప్పటివరకు కేవలం 25 వేల ఉద్యోగాలే భర్తీ చేసిందని విమర్శించారు. బీజేపీ సైతం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘ఎస్’ సంస్థను స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తానని వెల్లడించారు.
డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయడానికి తాను ఎన్నికల బరిలోకి రాలేదని, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆకాష్ కొల్లూరు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు డబ్బు, ప్రలోభాల రాజకీయాలకు వేదిక కాకూడదని, పట్టభద్రుల ఓటు సామాజిక మార్పు, సామాజిక న్యాయానికి ఆయుధంగా మారాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ ప్రజలకు చేసిన సేవలు, భవిష్యత్తు కార్యాచరణపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో తన నిబద్ధతను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
