- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం. .Aasara Pensions
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్లను (Aasara Pensions) చింతలపాలెం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ మాలవత్ శారదా సామ్య నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో ఆండాలు, ఎంపీవో భూపాల్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరాల కొండా రెడ్డి తదితరులు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం వల్ల నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
అనంతరం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అధికారులు ప్రారంభించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల అధికారులు సూచించారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దొండపాడు సర్పంచ్ చెన్న కేశి వెంకయ్య యాదవ్, ఉప సర్పంచ్ ఆంజనేయులు,ఆర్ఐ ఆత్రేయ,సీనియర్ నాయకుడు మోర్తల సీతారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
