Homeఆంధ్రప్రదేశ్Y.S. Avinash Reddy| ఎంపీ అవినాశ్ రెడ్డిపై పోలీసుల నిఘా..

Y.S. Avinash Reddy| ఎంపీ అవినాశ్ రెడ్డిపై పోలీసుల నిఘా..

  • శాంతిభద్రతల దృష్ట్యా బయటకు రావద్దని హెచ్చరిక..Y.S. Avinash Reddy
  • నోటీసులు జారీ చేసిన పులివెందుల పోలీసులు..

వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (Y.S. Avinash Reddy) కదలికలపై పులివెందుల పోలీసులు నిఘా పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తన నివాసం నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. పులివెందుల పరిధిలోని గ్రామాల్లో ఎంపీ పర్యటిస్తే శాంతిభద్రతల సమస్యలు, ఘర్షణలు తలెత్తే అవకాశముందని వచ్చిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని పంపించారు.

ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు, పాత కేసులకు సంబంధించి కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారని, వారిని విడిచిపెట్టాలని అవినాశ్ రెడ్డి పోలీసులను కోరారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు.

- Advertisement -

పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, వేముల మండలాల్లో ఇప్పటికే రాజకీయ ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. నామినేషన్ల పరిశీలన సజావుగా సాగేందుకు అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News