- ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు..Raw Milk for Skin
- ఫస్ట్ ప్లేస్ లో సహజసిద్ధమైన పచ్చిపాలు..
ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, మచ్చలేని అందమైన చర్మాన్ని కోరుకుంటారు (Raw Milk for Skin). కానీ ప్రస్తుత కాలుష్యభరిత వాతావరణం, ఎండల కారణంగా చర్మం తన నిగారింపును కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. రసాయనాలతో కూడిన క్రీమ్‌లకు బదులుగా సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా చర్మానికి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సంరక్షించుకోవచ్చు. అలాంటి అద్భుతమైన నేచురల్ క్లెన్సర్‌లలో పచ్చి పాలు ముందు వరుసలో ఉంటాయి. చర్మ సౌందర్యానికి పచ్చి పాలు ఏ విధంగా సహాయపడతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సహజ క్లెన్సర్‌గా పని చేస్తుంది :Raw Milk for Skin
పాలు ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్. ప్రతిరోజూ పాలతో ముఖాన్ని మర్దనా చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న ధూళి, మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది చర్మం తాజాగా కనిపించేలా చేస్తుంది.
కాంతివంతమైన చర్మం :
పచ్చి పాలను రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం లోతుగా పోషణ పొంది ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా, ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది.
మచ్చలు, ట్యాన్ నివారణ :
ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, దద్దుర్లు తగ్గించడంలో పాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎండ కారణంగా చర్మం కందిపోయి నల్లబడటాన్ని తగ్గించడంలో ఇది చక్కటి పరిష్కారం.
మృదువైన, తేమతో కూడిన చర్మం: పచ్చి పాలలో ఉండే సహజ కొవ్వు పదార్థాలు చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి. దీనివల్ల చర్మం ఎప్పుడూ మృదువుగా, సున్నితంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వాడటం ద్వారా వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించవచ్చు.
పచ్చి పాలను ముఖానికి రాసుకునే సరైన పద్ధతి :
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పచ్చి పాలు, దూది తీసుకోవాలి. దూది ఉండను పాలలో ముంచి, ముఖం అంతటా సమానంగా రాయాలి. పాలు సహజంగా ఆరిన తర్వాత, అదే దూదిని ఉపయోగించి మరోసారి పాలను రాయాలి. ఇలా 3 నుంచి 4 సార్లు అప్లై చేయాలి. సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌కు స్వస్తి పలికి, ఇంట్లోనే దొరికే పచ్చి పాలను మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ చర్మంలో స్పష్టమైన తేడాను గమనించవచ్చు!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
