Homeనిజామాబాద్‌Tadwai Man Malaysia Jail| మలేషియా జైల్లో తాడ్వాయి యువకుడు!

Tadwai Man Malaysia Jail| మలేషియా జైల్లో తాడ్వాయి యువకుడు!

  • ఏజెంట్ల మోసానికి బలైన నిరుపేద కుటుంబం..!Tadwai Man Malaysia Jail
  • ఐదు నెలలుగా జైల్లోనే మగ్గుతున్న సురేష్Tadwai Man Malaysia Jail
  • భర్తను విడిపించేందుకు బంగారం తాకట్టు పెట్టిన భార్య..!
  • ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆదుకోవాలని సురేష్ భార్య మౌనిక వేడుకోలు..!

బ్రతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన యువకులకు ఏజెంట్ల మోసాలు శాపంగా మారుతున్నాయి. మంచి ఉద్యోగం, అధిక సంపాదన ఉంటుందని నమ్మించి విదేశాలకు పంపుతున్న కొందరు ఏజెంట్లు అమాయక యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి మోసానికే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు బలయ్యాడు. వర్క్ వీసా అని నమ్మించి టూరిస్ట్ వీసాపై మలేషియాకు పంపడంతో గత ఐదు నెలలుగా జైల్లో మగ్గుతున్నాడు. భర్తను ఎలాగైనా జైలు నుంచి విడిపించాలని అతడి భార్య మౌనిక కన్నీటితో వేడుకుంటోంది(Tadwai Man Malaysia Jail).

వర్క్ వీసా అని నమ్మించి టూరిస్ట్ వీసాపై పంపారు..

- Advertisement -

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన అజ్జెపల్లి సురేష్ (32) గత జూన్ 4న ఉపాధి కోసం మలేషియాకు వెళ్లాడు. కామారెడ్డికి చెందిన గొల్ల శ్యామ్‌రాజ్, మొడెగామకు చెందిన సంతోష్ అనే ఏజెంట్లు వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి సురేష్‌ను విదేశాలకు పంపించారు. ఇందుకోసం ఆయన వారి వద్ద రూ.1,40 లక్షలు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే మలేషియా చేరుకున్న తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన సురేష్‌కు తనది వర్క్ వీసా కాదని, టూరిస్ట్ వీసా అని తెలిసింది. దీంతో అక్కడే ఉండిపోయిన ఆయన, పోలీసులకు చిక్కకుండా సుమారు నెలరోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. చివరకు జూలై 3న పోలీసులు పట్టుకుని జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నాడు.

tadwai

విడిపిస్తామని చెప్పి మళ్లీ మళ్లీ డబ్బులు వసూలు..

జైల్లో తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఎలాగైనా తనను బయటకు తీసుకురావాలని సురేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా వేడుకున్నాడు. ఇదే అదనుగా భావించిన ఏజెంట్లు సురేష్‌ను పోలీసుల నుంచి విడిపిస్తామని నమ్మించి మరో లక్ష రూపాయలు పంపించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో వారు రూ.లక్ష పంపించారు.

అయినా సురేష్ విడుదల కాకపోవడంతో మరో రూ.70 వేలు పంపించాలని ఏజెంట్లు ఒత్తిడి చేశారు. దీంతో భర్తను విడిపించుకోవాలనే ఆశతో భార్య మౌనిక, తల్లి రామవ్వ తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.70 వేలు పంపించారు. అయినప్పటికీ ఇప్పటివరకు సురేష్ విడుదల కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సురేష్ విదేశాలకు వెళ్లడం, జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నించడం వంటి వాటి కోసం ఇప్పటివరకు మొత్తం రూ.3.10 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

tadwai 2

ఎమ్మెల్యేను కలిసినా ఫలితం శూన్యం..

తమ సమస్యను పరిష్కరించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి గోడు వెళ్లబోసుకున్నామని సురేష్ భార్య మౌనిక తెలిపింది. సురేష్‌ను మలేషియా జైలు నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వివరించింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతకుముందు మూడు నెలల క్రితం స్థానిక తాడ్వాయి ఎస్సై నరేష్‌ను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ ఆశించిన స్పందన లభించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.

ఇద్దరు చిన్నారులతో భార్య ఎదురుచూపులు..

జైల్లో ఉన్న సురేష్‌కు ఇద్దరు చిన్న వయసు గల కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన భర్త విదేశీ జైలులో మగ్గుతుండటంతో భార్య, తల్లి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించినా తమకు న్యాయం జరగలేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి మలేషియా అధికారులతో సంప్రదింపులు జరిపి తన భర్తను జైలు నుంచి విడిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భార్య మౌనిక, తల్లి రామవ్వ వేడుకుంటున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News