- సిఈ పైళ్ల ధర్మారెడ్డి నియామకంపై వివాదం..
- పదవీ విరమణ పొందినా కీలక పోస్టులో..
- నల్గొండ బైపాస్ రోడ్డు పనుల్లో అక్రమాల ఆరోపణలు
- కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారంటూ విమర్శలు
- చెరువులు, రిజర్వాయర్లలో అక్రమ మట్టి తవ్వకాలు?
- 60 అడుగుల లోతు వరకు అక్రమ తవ్వకాలు
- ఎర్రమట్టికి బదులుగా నల్లరేగడి, బంకమట్టి వినియోగం
- భూగర్భ జలాలపై ప్రభావం.. ఎండిపోతున్న రైతుల బోర్లు
- అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులంటూ బెదిరింపులు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖలో అనుభవజ్ఞులైన అధికారులు లేరా..? ఒకవేళ ఉన్నా వారికి పని చేతకాదా..? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది.. ఒక రిటైర్డ్ అయిన ఇంజినీర్ వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చినీయాంశం అవుతోంది..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖలో అనుభవజ్ఞులైన అధికారులు లేరా..? ఒకవేళ ఉన్నా వారికి పని చేతకాదా..? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది.. ఒక రిటైర్డ్ అయిన ఇంజినీర్ వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చినీయాంశం అవుతోంది.. ఏఈ స్థాయినుంచి ఎదిగి ఎస్.ఈ. గా పదవీ విరమణ చేసిన పైళ్ల ధర్మారెడ్డిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించుకుని, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వేలకోట్ల బడ్జెట్ కలిగిన నేషనల్ హైవేస్ శాఖ ను అప్పగించింది ప్రభుత్వం..
రూ. 15,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల వరకు విలువైన జాతీయ రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టుల బాధ్యతలను రిటైర్డ్ అధికారి పైళ్ల ధర్మారెడ్డి(Pailla Dharma Reddy) చేతిలో పెట్టడం ప్రభుత్వ పారదర్శకతకే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రస్తుతం నల్గొండ బై పాస్ రోడ్డు నిర్మిస్తున్న ఎస్.ఎల్.ఎం.ఐ. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మైనింగ్ శాఖనుండి ఎలాంటి పర్మిషన్ లేదని తెలుస్తోంది.. కానీ అక్రమంగా మట్టి త్రవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతుండటం గమనార్హం.. ఈ పూర్తి వ్యవహారంపై సెంట్రల్ విజిలెన్స్ విచారణ చేపట్టింది..
రాష్ట్రంలో అత్యంత కీలకమైన, వేల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన రోడ్లు, భవనాల శాఖలో రిటైర్డ్ అధికారుల ‘సిండికేట’ అరాచకం తారాస్థాయికి చేరింది. పదవీ విరమణ పొందినప్పటికీ, పైరవీలు, అక్రమ సంపాదన కోసం కీలక పదవుల్లోనే కొనసా గుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీజీపీఎస్సీ ద్వారా కష్టపడి ఉద్యోగాలు సాధించి, అర్హత కలిగిన రెగ్యులర్ ఇంజనీర్లు సర్వీస్‌లో ఉన్నప్పటికీ.. కొందరి స్వార్థం కోసం రిటైర్డ్ అధికారులకు కట్టబెడుతున్న నాన్-రెగ్యులర్ అంటే ఔట్సోర్సింగ్ / కాంట్రాక్ట్ నియామకాలు శాఖను సర్వనాశనం చేస్తున్నాయి.

అధర్మానికి కేరాఫ్‌గా పైళ్ల ధర్మారెడ్డి నియామకం!
ఏఈ స్థాయి నుంచి ఎదిగి, ఎసఈ గా పదవీ విరమణ చేసిన పైళ్ల ధర్మారెడ్డి(Pailla Dharma Reddy) ఉదంతమే ఇందుకు ప్రధాన నిదర్శనం. రిటైర్ అయ్యాక కూడా నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ హోదాను ఔట్సోర్సింగ్ పద్ధతిలో దక్కించుకోవడం వెనుక పెద్ద తంతంగమే నడిచిందనే విమర్శలున్నాయి. రూ. 15,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల వరకు విలువైన జాతీయ రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టుల బాధ్యతలను రిటైర్డ్ అధికారి చేతిలో పెట్టడం ప్రభుత్వ పారదర్శకతకే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. గుత్తేదారులతో కుమ్మక్కై, నాసిరకం పనులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.
వెలుగు చూస్తున్న తీవ్రమైన ఆరోపణలు, కుంభకోణాలు :
కాగా కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చిన నిధులతో నల్గొండ బై పాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.. ఈ రోడ్డు నిర్మాణంలో ఎస్.ఎల్.ఎం.ఐ. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చాయి.. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, రిజర్వాయర్ల నుంచి (మర్రిగూడ చందన పల్లి, దోమలపల్లి, పానగల్ ఉదయసముద్రం తదితర ప్రాంతాల్లో) 60 అడుగుల లోతు వరకు తవ్వి ఎర్రమట్టికి బదులుగా నాసిరకం నల్లరేగడి, బంకమట్టిని అక్రమంగా తరలించి రోడ్డు నిర్మాణంలో వినియోగిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి, రైతుల బోర్లు ఎండిపోవడమే కాకుండా, కొద్దిరోజులకే రోడ్లు గుంతలమయమై ప్రమాదకరంగా మారుతున్నాయి. మట్టి దందాను ప్రశ్నించిన దళిత యువకులు, స్థానికులపై అక్రమ కేసులు బనాయించినట్లు విమర్శలు వస్తున్నాయి..
ఎల్బీనగర్ – మల్కాపురం రహదారి :
ఈ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగడం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, వర్షాకాలంలో ఫ్లైఓవర్లపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భారీ బినామీ ఆస్తులు: ధర్మారెడ్డి హయాంలో హైదరాబాద్ శివారులో వాణిజ్య భవనాలు, రూ. 20 కోట్లతో విలాసవంతమైన ఇల్లు, బినామీ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పెట్రోల్ బంకులు వెలశాయనే తీవ్ర ఆరోపణలున్నాయి. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లకు వడ్డీకి నగదు సర్దుబాటు చేయడం వంటి వ్యాపారాలు నడుపుతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
సీనియారిటీ జాబితా తారుమారు :
కోర్టు కేసులు, వివాదాల పేరుతో దశాబ్దాలుగా రెగ్యులర్ ప్రమోషన్లను నిలిపివేసి, జీవో 20 ప్రకారం రూపొందించిన సీనియారిటీ లిస్టును స్వలాభం కోసం మార్చేశారనే ఆరోపణలున్నాయి. అభ్యంతరాల స్వీకరణకు నిబంధనల ప్రకారం 15 రోజుల సమయం ఇవ్వాల్సి ఉండగా, కేవలం 3 రోజుల గడువు మాత్రమే ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఏసీబీ దాడులు జరుగుతున్న మారని నైజం :
ఇటీవల కాలంలో ఏసీబీకి చిక్కిన ఈఎన్సీ మోహన్ నాయక్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడటమే ఈ శాఖలో వేళ్లూనుకున్న వేల కోట్ల అవినీతికి నిదర్శనం. నెలకు లక్షల్లో జీతం తీసుకునే అధికారులు ఇంతటి అవినీతికి పాల్పడుతుంటే, అటువంటి వారినే వెనకేసుకొస్తున్న ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ అండ్ బీ శాఖలో రిటైర్డ్ అధికారుల పొడిగింపులను, ఎక్స్టెన్షన్లను రద్దు చేస్తామని మంత్రులు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమ్యస్థానం లేని పాలనకు అద్దం పడుతోంది.
తక్షణ తొలగింపు :
కీలక పోస్టుల్లో పాతుకుపోయిన రిటైర్డ్ అధికారి పైళ్ల ధర్మారెడ్డిని, ఇతర రిటైర్డ్ అధికారులను తక్షణమే సాగనంపాలని ప్రజాసంఘాలు, ఇంజనీర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నత స్థాయి విచారణ :
ధర్మారెడ్డి హయాంలో సాగిన రూ. 15,000 కోట్ల పైచిలుకు కాంట్రాక్టులు, విడుదలైన బిల్లులు, అక్రమాస్తులు, బినామీ దందాలపై సిట్టింగ్ జడ్జితో లేదా ‘స్వతంత్ర నిపుణుల కమిటీ’ తో సమగ్ర దర్యాప్తు జరిపించాలి.
రెగ్యులర్ ఉద్యోగులకు న్యాయం :
టీజీపీఎస్సీ ద్వారా అర్హత సాధించిన రెగ్యులర్ ఇంజనీర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించి శాఖకు పూర్వవైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంజనీర్ల సంఘాలు, ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
