Homeసినిమా‘Dharman’ | మూవీలో రామ్ పోతినేని, గ్లింప్స్‌ రిలీజ్ 

‘Dharman’ | మూవీలో రామ్ పోతినేని, గ్లింప్స్‌ రిలీజ్ 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా రూపొందుతున్న ‘ధర్మన్’లోకి(Dharman) మరో క్రేజీ హీరో చేరారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భాగమయ్యారు.  

డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే నటన, ప్రత్యేకమైన ఎనర్జీతో రామ్ పోతినేని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘దేవదాస్’తో గుర్తుండిపోయే అరంగేట్రం చేసిన ఆయన, ‘రెడీ’, ‘కందిరీగ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. వరుస విజయాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. 

- Advertisement -

రామ్ ఎంట్రీని ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో స్టైలిష్ సర్‌ప్రైజ్ ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన క్షణం ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటుంది. విమానంలో ప్రయాణికులకు ముందున్న ప్రయాణంలో టర్బులెన్స్ ఉండబోతోందని ప్రకటన రావడంతో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆ హెచ్చరికతో ఆసక్తి పెరుగుతున్న సమయంలో రజనీకాంత్ ఒక గన్‌ను విసరగా, రామ్ ఎంతో స్టైల్‌గా దాన్ని అందుకుంటారు. ఈ పవర్‌ఫుల్ మూమెంట్ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.

గడ్డం, కళ్లద్దాలతో సిగరెట్ తాగుతూ మాస్ అవతార్‌లో కనిపించిన రామ్ తనదైన స్టైల్‌తో అదరగొట్టారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సీక్వెన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

‘ధర్మన్’(Dharman) చిత్రంతో రామ్ పోతినేని కెరీర్‌లో మరో కీలకమైన మైలురాయిని అందుకోబోతున్నారు. ఈ సినిమాతో ఆయన తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు, తొలిసారి లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ అన్ని భాషల ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన ఆకర్షణగా, రామ్ పోతినేని వంటి క్రేజీ హీరోల చేరికతో ‘ధర్మన్’పై(Dharman) అంచనాలు మరింత పెరుగుతున్నాయి. భారతీయ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్లలో ఈ చిత్రం ఒకటిగా నిలుస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News