హుజూర్ నగర్ (మేళ్లచెరువు): సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ప్రధాన రహదారిపై బ్యాటరీ బైక్ అగ్నిప్రమాదానికి(EV Bike short Circuit) గురై పూర్తిగా దగ్ధమైన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఎస్వీ రెడీమేడ్ డ్రెస్సెస్ యజమాని సామల వెంకట్ రెడ్డి ఎప్పటిలాగే తన బ్యాటరీ బైక్‌కు ఉదయం చార్జింగ్ పెట్టారు.కొద్దిసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటలు క్షణాల్లోనే బైక్ అంతటా వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.సమాచారం అందుకున్న మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం పూర్తిగా చల్లార్చారు.ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా కాలిపోయినప్పటికీ, ఎలాంటి నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
EV Bike short Circuit | చార్జింగ్ పెడుతుండగా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్.. క్షణాల్లో బైక్ దగ్ధం
By Aadab Desk
- Advertisement -
